Royal Challengers Bangalore captain Virat Kohli on Thursday admitted that he made a mistake by taking on Jasprit Bumrah at the wrong time in their run chase of 188 which is why the home side lost the match by 6 runs against Mumbai Indians at the M Chinnaswamy stadium.
#ipl2019
#rcbvsmi
#mumbaiindians
#royalchallengersbangalore,
#jaspritbumrah
#viratkohli
#rohithsharma
#abdevilliers
#chinnaswamystadium
ఐపీఎల్ 2019 సీజన్ ఆరంభానికి ముందు లీగ్ ప్రసారుదారు స్టార్ స్పోర్ట్స్ తన ట్విట్టర్‌లో ఓ యాడ్‌ని పోస్టు చేసింది. ఆ యాడ్‌లో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీని జస్ప్రీత్ బుమ్రా స్లెడ్జింగ్ చేస్తాడు. దీంతో విరాట్ కోహ్లీ "నీ కెప్టెన్‌నే స్లెడ్జింగ్ చేస్తావా? అని నవ్వుతూ ఎట్టకేలకు స్లెడ్జింగ్ చేయడం ఎలాగో నేర్చుకున్నావ్" అని బదులిస్తాడు.ఐపీఎల్ టోర్నీలో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా గురువారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బుమ్రా వేసిన తొలి ఓవర్‌లోనే కోహ్లీ హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు. అయితే, ఆ తర్వాత రెండో ఓవర్‌లో పుంజుకున్న బుమ్రా కెప్టెన్ కోహ్లీని ఔట్ చేశాడు. అచ్చం ఆ యాడ్‌లో బుమ్రా చెప్పినట్లే... విరాట్ కోహ్లీ వికెట్ తీసి.. తాను వరల్డ్ బెస్ట్ బౌలర్‌నని నిరూపించుకున్నాడు.